చిత్తూరు కలెక్టరేట్ : డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణను మంగళవారం ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలపతిరావు, గిరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లాలోని పాఠశాలల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు అభినందనలు తెలిపారు. నేతలు గంటా మోహన్, దేవ రాజు రెడ్డి, రాధా కుమారి, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఎస్‌ఎస్‌కే రాజా, మహేష్, రమణారెడ్డి, తేజోమూర్తి, రవీంద్ర, మోహన్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.


