చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యలు సకాలంలో పరిష్కారించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మైనగుండ్లపల్లెలో ఓవర్‌లోడ్ ఎక్కువగా ఉందని వినియోగదారుడు పద్మనాభరెడ్డి తెలిపారు. అదనపు లైన్ ఏర్పాటుచేసి ట్రాన్స్‌ఫార్మర్ పెట్టాలన్నారు. అలాగే నగరంలోని మిట్టూరులో కరెంటు బిల్లు ఎక్కు వగా వచ్చిందని వాటిని సరిచేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏఈలు పర్యటించి సమస్యలకు పరిష్కార మార్గం చూపడానికి కృషిచేయాలని ఎస్‌ఈ అన్నారు. వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేయరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని 40 సెక్షన్ల పరి ధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
– ఇద్దరికి తీవ్ర గాయాలు
బైరెడ్డిపల్లె: బైరెడ్డిపల్లె–పుంగనూరు రహదారిలోని గంగినాయనపల్లె వద్ద సోమ వారం ఓ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ చందనప్రియ కథ నం మేరకు.. రామకుప్పం మండలం భగలనత్తం గ్రామానికి చెందిన హరిబాబు(27), అతని భార్య భువనేశ్వరి, చెల్లెలు స్వప్న నాలుగురోడ్డ నుండి స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా కారు లో వస్తున్న తమిళనాడు రాష్ట్రం ధర్మపురికి చెందిన యువరాజు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో గంగినాయనపల్లె సచివాలయ ఎమ్‌ఎల్‌హెచ్‌పీ సాయిదివ్య ప్రథమచికిత్స నిర్వహించారు. అనంత రం 108 వాహనంలో కుప్పం పీఈఎస్‌కు తరలిస్తుండగా హరిబాబు మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌ల దొంగ అరెస్ట్
పలమనేరు: అత్యంత చాకచక్యంగా ద్విచక్రవాహనాలను చోరీచేసే ఓ దొంగను పలమనేరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక నాగమంగళం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానంగా వ్యవహరించిన ఓ వ్యక్తిని విచారించగా విషయం బయటపడింది. బైరెడ్డిపల్లి మండలానికి చెందిన గంగిరెద్దుల వరదరాజు(46) బైక్‌ల చోరీలనే వృత్తిగా చేసుకున్నాడు. ఈప్రాంతంలో బైక్‌లను చోరీచేసి బి.కొత్తకోట మండలంలో విక్రయిస్తుండేవాడు, పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పట్టణంలో బైక్‌లు నిలిపే వాళ్లు వాహనాలకు జీపీఎస్ పెట్టుకోవాలనిసీఐ మోహన్‌రెడ్డి సూచించారు.
ఇన్నోవేషన్ స్టార్టప్‌పై శిక్షణ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో అధ్యాపకులకు ఆరు రోజుల పాటు జరగనున్న ఇన్నోవేషన్ స్టార్టప్ ఎకో సిస్టం అండ్ ఎంటర్‌ప్రైనర్ షిప్ ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ టు బిల్డ్ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ అనే అంశంపై అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. రూసా ఫేజ్–2, సెంటర్ ఆఫ్‌ఎక్సలెన్స్ ఇన్ వైరస్ లైక్ పార్టికల్స్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీసీ టాటా నర్సింగరావు సోమవారం ప్రారంభించారు. అనంతనం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలను గుర్తించి వాటికి సరైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ఉపయోగకరమైన ఆవిష్కరణలు, స్టార్టప్‌లుగా రూపు దిద్దే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు క ల్పించాలని పేర్కొన్నారు. రెక్టార్ ఆచార్య అప్పారావు మాట్లాడుతూ యువప్రతిభను గుర్తించి విద్యార్థులను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్వయం ఉపాధి వైపు నడిపించడంలో అధ్యాపకుల పాత్ర కీలకమని తెలిపారు. కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మావతి, వైజాగ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రవి ఈశ్వరపు, ఆచార్య హేమ, ఆచార్యులు కేవీ సుచరిత, బాలాజీ, రాజశేఖర్, వంశీ రాయల బృందం పాల్గొంది.


