నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ షేర్లు | Stock Market Closing Update 23rd October 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ షేర్లు

Oct 23 2024 4:10 PM | Updated on Oct 23 2024 4:30 PM

Stock Market Closing Update 23rd October 2024

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 అస్థిరమైన సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 138.74 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 80,081.98 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36.60 పాయింట్లు లేదా 0.15 శాతం పడిపోయి 24,435.50 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, లార్సెన్ & టూబ్రో, అదానీ పోర్ట్స్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర స్టాక్స్‌ మాత్రం లాభాలతో మెరిశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement