హైదరాబాద్‌లో అతి పెద్ద ‘పోర్షే ’ కార్‌ షోరూమ్‌ | Porsche 911 GT3 India Launch Largest Porsche Centre Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అతి పెద్ద ‘పోర్షే ’ కార్‌ షోరూమ్‌

Jun 21 2026 7:42 AM | Updated on Jun 21 2026 11:11 AM

Porsche 911 GT3 India Launch Largest Porsche Centre Hyderabad

హైదరాబాద్‌: లగ్జరీ స్పోర్ట్స్‌ కార్ల దిగ్గజం పోర్షే ఇండియా తాజాగా భారత్‌లో 911 జీటీ3ని ప్రవేశపెట్టింది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గంటకు 311 కి.మీ.దూరం ప్రయాణించగలదు. దీని ఎక్స్‌ షోరూం ధర రూ.3.32 కోట్లుగా ఉంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

ఇక, కంపెనీ దేశంలోనే అతిపెద్ద షోరూమ్‌ ‘పోర్షే సెంటర్‌’ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈవీఎమ్‌ ప్రీమియం కార్స్‌ భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేసింది. దాదాపు 2,800 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో ఉండే ఈ లగ్జరీ సెంటర్లో సేల్స్, సర్వీస్, స్పేర్‌ పార్ట్స్‌ (3ఎస్‌) సేవలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. ‘డెస్టినేషన్‌ పోర్షే’ అనే వినూత్న డిజైన్‌ కాన్సెప్ట్‌తో ఈ షోరూమ్‌ను తీర్చిదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement