ఏఐ మెమరీచిప్స్‌ విస్తరణకు రూ. 1,000 కోట్లు  | Micromax-Phison JV MiPhi plans Rs 1,000 crore capex in Greater Noida | Sakshi
Sakshi News home page

ఏఐ మెమరీచిప్స్‌ విస్తరణకు రూ. 1,000 కోట్లు 

Jun 27 2026 6:22 AM | Updated on Jun 27 2026 6:22 AM

Micromax-Phison JV MiPhi plans Rs 1,000 crore capex in Greater Noida

సాఫ్ట్‌వేర్‌లోకి కూడా ఎంట్రీ 

మైఫై ప్రణాళికలు 

న్యూఢిల్లీ: ఏఐ మెమరీ చిప్స్‌ తయారీ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై మైఫై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాలని, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ప్రస్తుతమున్న ప్లాంటును విస్తరించాలని యోచిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, ఆటోమొబైల్‌ తదితర రంగాల నుంచి మెమరీ సొల్యూషన్స్‌కి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైఫై సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు వ్యాపార వృద్ధి, రూ.1,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 

మైక్రోమ్యాక్స్, తైవాన్‌కి చెందిన ఫైసన్‌ సంస్థ కలిసి జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటు చేసిన మైఫై గతేడాది జనవరిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. దేశ విదేశీ కస్టమర్ల నుంచి భారీ ఆర్డర్ల దన్నుతో వచ్చే రెండు మూడేళ్లలో యూనికార్న్‌గా (1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌) ఎదిగే అవకాశం కూడా ఉందని శర్మ తెలిపారు. కేవలం హార్డ్‌వేర్‌కే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్‌వేర్‌ విభాగంలోకి కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధ పనులకు సంబంధించి సిస్టమ్‌ మెమరీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తమ ఏఐ అడాప్టివ్‌ మెమరీ సాఫ్ట్‌వేర్‌ సహాయకరంగా ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement