మారుతీ కారు ఓనర్లకు గుడ్‌ న్యూస్‌.. | Maruti Suzuki to expand service network from 5400 to 8000 touchpoints by FY31 | Sakshi
Sakshi News home page

మారుతీ కారు ఓనర్లకు గుడ్‌ న్యూస్‌..

Jun 27 2025 5:37 PM | Updated on Jun 27 2025 6:26 PM

Maruti Suzuki to expand service network from 5400 to 8000 touchpoints by FY31

ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ తమ సర్వీస్‌ నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం 5,400గా ఉన్న టచ్‌పాయింట్ల సంఖ్యను 2030–31 నాటికి 8,000కు పెంచుకోనుంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు, అలాగే తమ ఎలక్ట్రిక్‌ వాహన ఆవిష్కరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయిచి తెలిపారు.

1,000 పైగా నగరాల్లో 1,500 ఈవీ ఎనేబుల్డ్‌ సర్వీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటిలో సుశిక్షితులైన సిబ్బంది, అధునాతనమైన పరికరాలు ఉంటాయని తకెయుచి చెప్పారు. మే నెలలో తమ సంస్థ భారీ స్థాయిలో 24.5 లక్షల వాహనాలను సర్వీస్‌ చేసినట్లు వివరించారు.

మరోవైపు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఆన్‌రోడ్‌ అసిస్టెన్స్‌ కోసం ప్రత్యేకమైన క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను కూడా మారుతీ సుజుకీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సర్వీస్‌ కార్యకలాపాల సహకారం కోసం ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లను, వాయిస్‌ బాట్‌లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement