breaking news
Service Network
-
మారుతీ కారు ఓనర్లకు గుడ్ న్యూస్..
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం 5,400గా ఉన్న టచ్పాయింట్ల సంఖ్యను 2030–31 నాటికి 8,000కు పెంచుకోనుంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు, అలాగే తమ ఎలక్ట్రిక్ వాహన ఆవిష్కరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయిచి తెలిపారు.1,000 పైగా నగరాల్లో 1,500 ఈవీ ఎనేబుల్డ్ సర్వీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటిలో సుశిక్షితులైన సిబ్బంది, అధునాతనమైన పరికరాలు ఉంటాయని తకెయుచి చెప్పారు. మే నెలలో తమ సంస్థ భారీ స్థాయిలో 24.5 లక్షల వాహనాలను సర్వీస్ చేసినట్లు వివరించారు.మరోవైపు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఆన్‌రోడ్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను కూడా మారుతీ సుజుకీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సర్వీస్ కార్యకలాపాల సహకారం కోసం ఏఐ ఆధారిత చాట్బాట్లను, వాయిస్ బాట్లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. -
సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించిన శాంసంగ్ ఇండియా
న్యూఢిల్లీ: శాంసంగ్ ఇండియా తాజాగా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇందులో భాగంగానే 535 సర్వీస్ వ్యాన్లను ప్రారంభించింది. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,000 తాలుకాల్లోని గ్రామాల్లో సంచరించనున్నాయి. అలాగే కంపెనీ 250కి పైగా సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అలాగే మరో 250కి పైగా రెసిడెంట్ ఇంజినీర్లను నియమించుకుంది. దీంతో కంపెనీ సర్వీస్ పాయింట్ల సంఖ్య 3,000కు పైగా చేరింది. శాంసంగ్ కస్టమర్ ఈ సర్వీస్ వ్యాన్ల సాయంతో కంపెనీ సేవలను త్వరితగతిన పొందొచ్చని శాంసంగ్ ఒక ప్రకటన లో తెలిపింది. కాగా శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈవో హెచ్‌సీ హాంగ్.. నోయిడాలోని కంపెనీ తయారీ ప్లాంటులో ఈ కస్టమర్ సర్వీస్ వ్యాన్లను ఆవిష్కరించారు.