దేశవ్యాప్తంగా రూ.50 పెరిగిన వంట గ్యాస్ ధరలు | LPG Gas Price Hike Rs 50 in India | Sakshi
Sakshi News home page

LPG Cylinder Price Hike: దేశవ్యాప్తంగా రూ.50 పెరిగిన వంట గ్యాస్ ధరలు

Apr 7 2025 4:26 PM | Updated on Apr 7 2025 4:49 PM

LPG Gas Price Hike Rs 50 in India

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన వెంటనే.. గ్యాస్ ధరల పెంపు కూడా జరిగింది. ఎల్‌పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

ధరల పెరుగుదల గురించి కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 500 నుంచి రూ. 550కు పెరిగింది. ఈ ధర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇతరులు రూ. 853 చెల్లించాల్సి (ధరల పెరుగుదలకు ముందు ఈ ధర రూ. 803గా ఉండేది) ఉంటుంది.

ఈ సందర్బంగా పెట్రోల్, డీజిల్ పై ఇటీవల ఎక్సైజ్ సుంకం పెంపు వినియోగదారులపై భారం మోపడానికి ఉద్దేశించినది కాదు. సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న 43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement