జూన్ 30 డెడ్‌లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్! | LPG Consumers Alert Complete This Task or Lose Your Subsidy | Sakshi
Sakshi News home page

జూన్ 30 డెడ్‌లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్!

Jun 15 2026 7:26 PM | Updated on Jun 15 2026 8:15 PM

LPG Consumers Alert Complete This Task or Lose Your Subsidy

భారతదేశంలో ఎల్‌పీజీ సబ్సిడీలను పారదర్శకంగా.. సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లక్షలాది ఎల్‌పీజీ వినియోగదారులు, ముఖ్యంగా 'ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన' (PMUY) లబ్ధిదారులు, తమ eKYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియను 2026 జూన్ 30లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులకు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ వంటి సంస్థల ద్వారా వచ్చే సబ్సిడీలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

ఈకేవైసీ ప్రక్రియ సులభంగా ఉంటుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇండేన్ వినియోగదారులు ఇండియన్‌ఆయిల్ వన్ యాప్‌ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ద్వారా, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు హెచ్‌పీ పే యాప్ లేదా ఆధార్ ఫేస్‌ఆర్‌డీ యాప్ ద్వారా ఈకవైసీ పూర్తి చేయవచ్చు. ఇందులో ఓటీపీ ధృవీకరణ, ఆధార్ లింకింగ్, ఫేస్ అథెంటికేషన్‌ వంటి దశలు ఉంటాయి.

ఇదీ చదవండి: కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. కాగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పరిధిలో లేని వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి కాదు. అయితే అయితే అర్హులైన వారు సమయానికి పూర్తి చేయకపోతే సబ్సిడీ ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి గడువు (జూన్ 30)లోపు ఈ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసుకోవడం ఉత్తమం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement