మరోసారి గ్యాస్‌ మంట | LPG Gas: Rs 29 hike on domestic Gas cylinder | Sakshi
Sakshi News home page

మరోసారి గ్యాస్‌ మంట

Jun 7 2026 5:04 AM | Updated on Jun 7 2026 11:31 AM

LPG Gas: Rs 29 hike on domestic Gas cylinder

గృహ వినియోగ సిలిండర్‌పై రూ.29 పెంపు  

న్యూఢిల్లీ: గృహ వినియోగ గ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. 14.2 కిలోల సిలిండర్‌పై ప్రభుత్వం రూ.29 పెంచేసింది. పెరిగిన ధర ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.913 నుంచి రూ.942కి చేరుకోనుంది. హార్మూజ్‌ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఇంధనం ధరలు పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

భారత్‌లో మార్చి 7వ తేదీన గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఏకంగా రూ.60 చొప్పున పెంచారు. అయినప్పటికీ ప్రభు­త్వ రంగ ఇంధన కంపెనీలకు నష్టాలు తప్పడం లేదని అధికారులు అంటున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ.703 చొప్పు­­న నష్టపోతున్నట్లు చెబుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement