చావు ఎప్పుడో కూడా చెప్పేస్తుందట! | Sakshi
Sakshi News home page

చావు ఎప్పుడో కూడా చెప్పేస్తుందట!

Published Sat, Dec 23 2023 9:52 AM

Life2vec Prediction About Death - Sakshi

‘వాన రాకడ ప్రాణం పోకడ’ గురించి కచ్చితంగా చెప్పలేరంటారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు వాన గురించి కొంత కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. మరి ప్రాణం సంగతేంటి? ఈ లోటూ తీరుస్తోంది కృత్తిమ మేధ. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీ గురించి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కానీ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రపంచ దేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకు ప్రధాన కారణం చాట్‌జీపీటీ. ఈ చాట్‌జీపీటీ టెక్నాలజీతో పాటు అన్నీ రంగాల్లో సమూల మార్పులకు కారణమైంది. అయితే తాజాగా, అదే ఏఐని ఉపయోగించి మనిషి చావు గురించి ముందే తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఓ సర్వే ప్రకారం.. ఈ ఏఐ మనిషి మరణంపై 78 శాతం ఫలితాలు నిజమవ్వడం చర్చాంశనీయంగా మారింది.

ప్రత్యేకంగా ఓ అల్గారిథమ్‌
సైంటిస్ట్‌లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ సాయంతో ఓ అల్గారిథమ్‌ను తయారు చేశారు. దాని ఆధారంగా ‘వారు ఎలా జీవిస్తారు. ఎలా మరణిస్తాడు’ అనే అంశంపై అంచనా వేశారు.  

లైఫ్‌ 2వీఈసీ పేరుతో
ఓ అధ్యయనం ప్రకారం.. సైంటిస్ట్‌లు ఓ ఏఐ ఆధారిత మోడల్‌ను తయారు చేశారు. చాట్‌జీపీటీ, బింగ్‌ ఏఐ, గూగుల్‌ బార్డ్‌ తరహాలో లైఫ్‌2వీఈసీ (life2vec) పేరుతో పిలిచే ఈ కృత్తిమ మేధ మృత్యువు ఎప్పుడు ముంచుకొస్తుందో ముందే పసిగట్టేస్తుంది. 

6లక్షల మంది మరణాల గురించి
మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌లో శిక్షణ పొందిన టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డెన్మార్క్‌ (DTU), యూఎస్‌ రిసెర్చర్లు ఏఐ ఆధారిత డెత్‌ ప్రిడెక్టర్‌ను అభివృద్ధి చేశారు. అనంతరం సుమారు 6 లక్షల మంది ఆదాయం,వృత్తి, పుట్టిన ప్లేస్‌, రోడ్డు ప్రమాదాలు ఏమైనా జరిగాయా? ప్రెగ్నెన్సీ హిస్టరీ ఇలా రకరకాలుగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అనంతరం వారి మరణంపై అంచనాల్ని వెలుగులోకి తెచ్చింది.   

వారి మరణాలకు కారణం
ఇందులో కొందరు త‍్వరగా మరణిస్తారని.. అందుకు గల కారణాల్ని వివరించింది. దీనికి ముందుగా మరణానికి దారితీసే కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి. మగవారు కావడం, మానసిక ఆరోగ్యం, స్కిల్డ్‌ వర్కర్లు, ఎక్కువ జీతం, కంపెనీల్లో నాయకత్వ పాత్ర పోషించడం వంటి కారణాలే ముందస్తు మరణాలకు కారణమని తెలిపింది.   

లైఫ్‌2వీఈసీని ఎలా అడగాలి?
యూజర్లు చాట్‌జీపీటీని ఓపెన్‌ చేసి అందులో కావాల్సిన కోడింగ్‌ గురించి లేదంటే ఏదైనా చరిత్ర గురించి ఎలా అడుగుతామో.. ఈ లైఫ్‌ 2 వీఈసీలో మరణం ఎప్పుడు? వంటి ప్రశ్నలు అడగొచ్చు.  

8 ఏళ్లపాటు ట్రైనింగ్‌ 
రీసెర్చర్లు ఈ లైఫ్‌2వీఈసీ మోడల్‌కు 2008 నుండి 2016 వరకు డేటాపై శిక్షణ ఇచ్చారు. జనాభా డేటా ఆధారంగా ముందుగా అంచనా వేసినట్లుగానే 2020 నాటికి మూడు శాతం కంటే ఎవరు మరణించారో సరిగ్గా అంచనా వేసింది. సున్నిత మైన అంశంం కాబట్టి మరణాల డేటాను మాత్రం అందుబాటులో ఉంచడం లేదేని ప్రొఫెరసర్‌ సునే లెహ్మాన్ చెప్పారు.

చదవండి👉 ‘AI నా ఉద్యోగాన్ని లాగేసుకుంది’

Advertisement
 
Advertisement