జియో రీఛార్జ్: రూ.198 ప్లాన్.. రోజుకి 2జీబీ డేటా! | Jio Rs 198 Recharge Plan Everything You Need to Know | Sakshi
Sakshi News home page

జియో రీఛార్జ్: రూ.198 ప్లాన్.. రోజుకి 2జీబీ డేటా!

Aug 1 2026 7:03 PM | Updated on Aug 1 2026 7:52 PM

Jio Rs 198 Recharge Plan Everything You Need to Know

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.198 కూడా ఒకటి. ఈ ప్లాన్ ద్వారా లభించే డేటా ఎంత, వ్యాలిడిటీ, ఇతర ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

రూ.198 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్ఎ‌స్‌లు పొందవచ్చు. అయితే వ్యాలిడిటీ మాత్రం 14 రోజులు మాత్రమే. కాగా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ వంటి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి. తక్కువ ధరలో రీఛార్జ్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక అవుతుంది.

రూ.55కే 1000పైగా ఛానళ్లు!
జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు.

రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్‌లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతో మొబైల్‌లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement