ఎఫ్‌పీఐల యూటర్న్‌  | FPIs made a significant Uturn in May 2025 | Sakshi
Sakshi News home page

ఎఫ్‌పీఐల యూటర్న్‌ 

Jun 9 2025 8:24 AM | Updated on Jun 9 2025 8:24 AM

FPIs made a significant Uturn in May 2025

దేశీ స్టాక్స్‌పట్ల గత నెల(మే)లో ఆసక్తి ప్రదర్శించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నెల(జూన్‌) తొలి వారంలో యూటర్న్‌ తీసుకుని నికరంగా రూ.8,749 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.19,860 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. అంతకుముందు ఏప్రిల్‌(చివర్లో కొనుగోళ్లవైపు మళ్లి) నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: చదువు కొంటున్నారా?

ప్రస్తుతం యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్‌ బలపడటం, యూఎస్, చైనా వాణిజ్య చర్చలపై ఆందోళనలు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌ నుంచి 2025 మార్చిలో రూ. 3,973 కోట్లు, ఫిబ్రవరిలో రూ.34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. వెరసి 2025లో ఇప్పటివరకూ నికరంగా రూ. 1.01 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement