గూగుల్‌లో పెట్టుబడి.. అసలు రహస్యం ఇదే! | Why Warren Buffett Finally Invested in Google? | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో పెట్టుబడి.. అసలు రహస్యం ఇదే!

Jul 25 2026 4:57 PM | Updated on Jul 25 2026 5:04 PM

Why Warren Buffett Finally Invested in Google?

ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ 2025 చివరి నాటికి బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈఓ పదవి నుంచి వైదొలగి.. ఛైర్మన్‌గా మాత్రమే ఉంటున్నారు. అయితే ఈయన ఈ వయసులో ఎలాంటి పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, కొత్త సీఈఓ 'గ్రెగ్ అబెల్' అన్నీ చూసుకుంటారని అందరూ అనుకున్నారు.

కానీ, ఒక ఇంటర్వ్యూలో బఫెట్ మాట్లాడుతూ.. గూగుల్ మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్'లో బెర్క్‌షైర్ పెట్టిన లేటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వెనుక అసలు మాస్టర్ మైండ్ తానేనని వెల్లడించారు.

నిజానికి ఈ పెట్టుబడి నిర్ణయం అంతా గ్రెగ్ అబెల్ తీసుకున్నారనే భావించారు. కానీ.. సీఈఓగా తుది నిర్ణయం ఆయనే తీసుకున్నప్పటికీ, అసలు ఈ ఐడియా పుట్టింది మాత్రం బఫెట్ మైండ్‌లోనే. "నేను అతడి ఆమోదం లేకుండా ఏదీ చేయను, అతను నా ఆమోదం లేని పని చేయడు. మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం గ్రెగ్ అబెల్ దే" అని బఫెట్ చాలా సింపుల్‌గా చెప్పారు.

అయితే గూగుల్‌లో ఇంత ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడానికి అసలు కారణం ఏంటో కూడా బఫెట్ ఓపెన్‌గా చెప్పేశారు. అప్పట్లో గూగుల్ కంపెనీ టెక్నాలజీ రంగంలో ఇంతలా ఎదుగుతుందని బఫెట్ నమ్మలేకపోయారట. అందుకే పెట్టుబడులు పెట్టలేదు. తాను 'పొరపాటు చేశానని' వారెన్ బఫెట్ అన్నారు. ఆ పశ్చాత్తాపం నుంచి బయటపడటానికే ఇప్పుడు ఆల్ఫాబెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement