ఏఐ రేసులో గూగుల్‌ వెనకబడిందా? సీఈఓ రియాక్షన్‌.. | Is Google Losing the AI War? Sundar Pichai Reveals Gemini Strategy, Faster Model Releases And Battle Plan Against Rivals | Sakshi
Sakshi News home page

ఏఐ రేసులో గూగుల్‌ వెనకబడిందా? సీఈఓ రియాక్షన్‌..

Jul 23 2026 8:45 AM | Updated on Jul 23 2026 10:10 AM

Is Google Losing the AI War Sundar Pichai Gemini 4 Counterattack Explained

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పోటీ ప్రపంచంలో  ప్రముఖ ఆన్‌లైన్‌ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్ తన ఆధిక్యాన్ని కోల్పోతోందా? ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల వేగానికి గూగుల్ రేసులో వెనుకబడిందనే వార్తలపై అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టత ఇచ్చారు. జెమిని 4 మోడల్ అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే దాదాపు ప్రతినెలా ఒక కొత్త ఏఐ మోడల్‌ను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు.

లోపాలను అంగీకరిస్తూనే స్పష్టమైన వ్యూహం

‘జెమిని 3.5 ప్రో’ ఆలస్యం కావడం, కోడింగ్ రంగంలో ప్రత్యర్థులు దూసుకుపోవడంపై పిచాయ్ స్పందించారు. ‘టెక్స్ట్, మల్టీమోడల్‌, రీజనింగ్‌లలో మేము గ్లోబల్ లీడర్‌గానే ఉన్నాం. ఏజెంటిక్ కోడింగ్ వంటి నిర్దిష్ట విభాగాల్లో మరింత పురోగతి సాధించాల్సి ఉందనేది వాస్తవం. ఆ లోటును త్వరలోనే భర్తీ చేస్తాం’ అని సుందర్ పిచాయ్ అన్నారు. కేవలం కొన్ని మోడళ్ల ఆలస్యాన్ని బట్టి సంస్థ సామర్థ్యాన్ని అంచనా వేయలేమని, ‘జెమిని ఫ్లాష్’ మోడళ్లు పరిశ్రమలోనే అత్యంత వేగవంతమైనవిగా నిలిచాయని గుర్తుచేశారు.

ఆర్థికంగా చెక్కుచెదరని బలం

కంపెనీపై ఏఐకి సంబంధించిన కొన్ని విమర్శలు వినవస్తున్నప్పటికీ గూగుల్ క్లౌడ్ వ్యాపారం బలంగానే ఉంది. క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడంతో గతంతో పోలిస్తే 82% వృద్ధి నమోదు చేసింది. జెమిని ఏపీఐల ప్రాసెసింగ్ నిమిషానికి 22 బిలియన్ టోకెన్ల మైలురాయిని దాటింది. ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో 90% పైగా ‘జెమిని ఎంటర్‌ప్రైజ్’ ఉపయోగిస్తున్నాయి. జెమిని యాప్‌కు 950 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement