‘ప్రతి విభేదాన్ని కోర్టుల దాకా తీసుకెళ్లొద్దు’ | Dont Take Every Dispute to Court Nirmala Sitharaman Advice Corporates | Sakshi
Sakshi News home page

‘ప్రతి విభేదాన్ని కోర్టుల దాకా తీసుకెళ్లొద్దు’

Sep 23 2026 9:48 AM | Updated on Sep 23 2026 9:55 AM

Dont Take Every Dispute to Court Nirmala Sitharaman Advice Corporates

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను బలోపేతం చేయాలి

భారత కార్పొరేట్లకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచన

ప్రతి విభేదంపై కోర్టు మెట్లు ఎక్కకుండా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ యంత్రాంగాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలని కార్పొరేట్‌ ఇండియాకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. పటిష్ఠమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంటే కేవలం ఏవో కొన్ని నిబంధనలను అమలు చేయడం మాత్రమే కాదని... సంస్థలు తమకు తాముగా నిర్దేశించుకునే ప్రమాణాలపై కూడా ఆధారపడి ఉంటుందని మంగళవారమిక్కడ జరిగిన ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) కార్యక్రమంలో ఆమె స్పష్టం చేశారు.

‘వ్యాపార సంస్థలు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. న్యాయపరమైన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, కానీ ప్రతి విభేదం లిటిగేషన్‌గా మొదలవ్వాల్సిన అవసరం లేదు. విభేదాలు వివాదాలుగా మారకముందే సంప్రదింపుల ద్వారా, ఆధారాలను బహిరంగంగా అందుబాటులో ఉంచడం ద్వారా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం’ అని సీతారామన్‌ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో, భారతీయ కార్పొరేట్లు కేవలం వ్యాపార పరిమాణంపై మాత్రమే కాకుండా మరింత పటిష్టమైన, సంక్షోభాలను తట్టుకునే, మెరుగైన పాలనతో కూడిన సంస్థలను నిర్మించడంపై ఫోకస్‌ చేయాలని ఆర్థిక మంత్రి సూచించారు.

ఆర్‌అండ్‌డీపై మరింత డబ్బు వెచ్చించాలి. భారత్‌లో తదుపరి దశ వృద్ధి పథానికి నాణ్యతే గీటురాయి కావాలని.. ఇందుకోసం పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)పై కార్పొరేట్లు మరింతగా వెచ్చించాలని సీతారామన్‌ కోరారు. అంతర్గతంగా లేదంటే విద్యా సంస్థలతో భాగస్వామ్యం ద్వారా దీన్ని సాకారం చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను మెరుగుపరచడంలో, అలాగే నవకల్పనలను ప్రోత్సహించడంలో ఆర్‌అండ్‌డీ దన్నుగా నిలుస్తుందని ఆమె చెప్పారు.

‘మేడిన్‌ ఇండియా నుంచి ఇమాజిన్డ్‌ ఇన్‌ ఇండియా ఉత్పత్తుల దిశగా పయనించడం మన ప్రధాన లక్ష్యం. ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయడం మాత్రమే కాదు, ఇక్కడే వాటికి రూపకల్పన చేయడంతో పాటు సాంకేతికంగా అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా మర్కెట్లలోకి తీసుకెళ్లాలి’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. భారత్‌లో స్థూల ఆర్‌అండ్‌డీ వ్యయం జీడీపీతో పోలిస్తే 0.83 శాతం మాత్రమే ఉండగా.. ఓఈసీడీ దేశాల సగటు 2.7 శాతం, చైనాలో 2.6 శాతం, అమెరికాలో 3.5 శాతంగా ఉన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 70 శాతం పైగా ప్రైవేటు రంగం నుంచే ఆర్‌అండ్‌డీకి ఖర్చు చేస్తుండగా.. భారత్‌లో ఇది కేవలం 36 శాతమేని కూడా చెప్పారు.

ఇదీ చదవండి: పెట్రోల్ డీలర్ల సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement