టర్మ్‌ ఇన్సూరెన్స్‌కి జీఎస్‌టీ జోష్‌ | GST Exemption Make Term Insurance Cheaper What You Need to Know | Sakshi
Sakshi News home page

టర్మ్‌ ఇన్సూరెన్స్‌కి జీఎస్‌టీ జోష్‌

Sep 23 2026 8:17 AM | Updated on Sep 23 2026 8:17 AM

GST Exemption Make Term Insurance Cheaper What You Need to Know

1.5 రెట్లు పెరిగిన పాలసీల కొనుగోళ్లు

యువతలో అధిక ఆసక్తి

ఏపీ, తెలంగాణలో 39 శాతం పైగా కొనుగోళ్లు

పాలసీబజార్‌ సర్వేలో వెల్లడి 

వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) నుంచి మినహాయింపు లభించిన నేపథ్యంలో గత ఏడాది వ్యవధిలో దేశీయంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కొనుగోళ్లు 1.5 రెట్లు పెరిగాయి. ప్రీమియంలు అందుబాటు స్థాయిలోకి రావడంతో ఆర్థిక భద్రత అవసరాల కోసం మరింత ఎక్కువ సమ్‌ అష్యూర్డ్‌ను ఎంచుకోవడం, అదనపు రైడర్లతో కవరేజీని పెంచుకోవడంలాంటి ధోరణులు పెరిగాయి. పాలసీబజార్‌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఈ నివేదిక ప్రకారం రూ. 3 కోట్ల పైచిలుకు కవరేజీ తీసుకున్న వారిలో ప్రవాస భారతీయులు,  సంపన్న వర్గాల (హెచ్‌ఎన్‌ఐ) వాటా వరుసగా 32 శాతం, 35 శాతం మేర పెరిగాయి. పురుషులతో పోలిస్తే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసే మహిళ సంఖ్య 27 శాతం పెరిగింది. ఇక యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్, ప్రీమియం వైవర్‌ తదితర ఆప్షన్ల దన్నుతో పాలసీలు తీసుకునే వాహనదారుల సంఖ్య 13 శాతం పెరిగింది. స్వయం ఉపాధి పొందుతున్న వారు ఇతర కస్టమర్‌ సెగ్మెంట్లతో పోలిస్తే 12 శతం మేర అధికంగా పెరిగారు. పాలసీదారుల వయస్సుపరంగా చూస్తే 18–25 వయస్సు గల యువత వాటా 20 శాతంగా నమోదైంది.

జీఎస్‌టీ మినహాయింపు అనంతరం ఏపీ, తెలంగాణలో పాలసీల కొనుగోళ్లు  39 శాతం మేర పెరిగాయి. అటు కేరళలో 11 శాతం, మహారాష్ట్ర 10 శాతం మేర వృద్ధి చెందాయి. ‘‘అఫోర్డబిలిటీ కారణంగా వినియోగదారులు తమ బీమా అవసరాలను మరొక్కసారి మదింపు చేసుకుంటున్నారు. మరింత ఎక్కువ సమ్‌ అష్యూర్డ్‌ని ఎంచుకుని, సమగ్రమైన కవరేజీ కోసం రైడర్లను తీసుకుంటున్నారు. ముఖ్యంగా హెచ్‌ఎన్‌ఐలు, ఎన్నారైలలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

అదే సమయంలో మహిళలు, గృహిణులు, స్వయం ఉపాధి పొందేవారిలో కూడా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. యువ వినియోగదారులు ముందు నుంచే ప్రొటెక్షన్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అఫోర్డబిలిటీ పెరిగే కొద్దీ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ని ఏదో నామమాత్రంగా కాకుండా, తగినంత కవరేజీనిచ్చే టర్మ్‌ ఇన్సూరెన్స్‌  పథకాలవైపు మొగ్గుచూపుతున్నారు’’ అని పాలసీబజార్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ హెడ్‌ వరణ్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇదీ చదవండి: పెట్రోల్ డీలర్ల సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement