ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో రోజూ బలపడింది. మంగళవారం డాలర్ మారకంలో 16 పైసలు పెరిగి 95.62 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గడం, అమెరికా–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో రూపాయి పెరుగుతుందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
ఉదయం డాలర్ మారకంలో రూపాయి విలువ 95.75 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో 23 పైసలు బలపడి 95.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కాగా, సోమ, మంగళవారాల్లో రూపాయి విలువ మొత్తంగా 34 పైసలు పెరిగింది.


