అనంతపురం జిల్లా: వజ్రకరూరు మండలం రాగులపాడు బాలుర గిరిజన గురుకుల పాఠశాల (Tribal Welfare Residential School) లో తొమ్మిదో తరగతి చదువుతున్న తులసీ నాయక్ అనే విద్యార్థి, రాత్రి సమయంలో హాస్టల్ గదిలో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. గదిలో కింద పడుకున్న సమయంలో పాము కరవడంతో విద్యార్థి గట్టిగా కేకలు వేశాడు. తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై చూసేసరికి అక్కడ పాము కనిపించింది.
పాముకాటు వేసిన వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో బాలుడి పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన వైద్యం కోసం విద్యార్థిని అనంతపురం సర్వజనాస్పత్రి (GGH Anantapur) కి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చేర్చి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.


