కలకలం.. విద్యార్థిపై ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు | Kollapur PG College Principal Assault On Student | Sakshi
Sakshi News home page

కలకలం.. విద్యార్థిపై ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు

Jul 8 2026 12:55 PM | Updated on Jul 8 2026 1:00 PM

Kollapur PG College Principal Assault On Student

కొల్లాపూర్:నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మార్క్ పోలోనియస్ ఓ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ కీచక ప్రిన్సిపాల్ బారి నుంచి తప్పించుకునే క్రమంలో సదరు విద్యార్థి సాహసోపేతంగా ప్రతిఘటించి, ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్టును బలంగా కొరకడంతో సదరు ప్రిన్సిపాల్ నగ్నంగానే అక్కడి నుంచి పారిపోయాడు. 

వివరాల ప్రకారం.. సదరు విద్యార్థి 2025లో తన పీజీ పూర్తి చేసుకున్నాడు. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ కోసం ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా, రాత్రి తన ఇంటికి వస్తేనే టీసీ ఇస్తానని కండిషన్ పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థి, తన స్నేహితుడిని వెంటబెట్టుకుని రాత్రి 10 గంటల సమయంలో ప్రిన్సిపాల్ నివాసానికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన విద్యార్థిపై ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్ ఒక్కసారిగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.

 ప్రిన్సిపాల్ తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో, ప్రాణరక్షణ కోసం విద్యార్థి తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్టును బలంగా కొరికేశాడు. విద్యార్థి గట్టిగా కొరకడంతో తీవ్ర నొప్పితో విలవిలలాడిన ప్రిన్సిపాల్, భయంతో నగ్నంగానే ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ ఘోర అవమానం నుంచి బయటపడిన బాధిత విద్యార్థి రాత్రికి రాత్రే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి కీచక ప్రిన్సిపాల్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

 ఈ విషయం గుప్పుమనడంతో తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన ప్రిన్సిపాల్ మార్క్ పోలోనియస్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని, అతనిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు- రెండు పారాగ్రాఫ్‌లు వచ్చేలా చూండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement