breaking news
Tribal Gurukul Girls College
-
పొలం బాట పట్టిన విద్యార్థినిలు
సాక్షి, సూర్యాపేట : ఈ రోజుల్లోని విద్యార్థులకు పొలం పనులు అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో.. పొలం పనులపై కొంతమందికి చులకన భావం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ప్రన్సిపాల్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. కళాశాలలోని విద్యార్థినులకు పొలం పనులు పరిచయం చేయాలని అనుకున్నారు. వృతి విద్యలో భాగంగా వారిచే కాసేపు పొలం పనులు చేయించారు. మునగాల మండలం ఆకుపాముల వద్ద కళాశాల పక్కన ఉన్న పొలాల్లోకి దిగిన విద్యార్థినిలు ఉత్సాహంగా వరి నాట్లు వేశారు.100 మంది విద్యార్థినిలతో పాటు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలను చూసినవారు విద్యార్థినులపై ప్రశంసలు కురిపించారు. కాగా, ఈ మధ్య కాలంలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పొలం బాట పడుతున్న సంగతి తెలిసిందే. తమ విధులను కాసేపు పక్కకు పెట్టి పొలం పనులు చేస్తూ సేద తీరుతున్నారు. -
కన్నీటి' గెడ్డ'
విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలోని గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాంగి ఎస్తేరు రాణి(14) శుక్రవారం ఉదయం సమీపంలోని గెడ్డలో స్నానానికి దిగి మునిగిపోయి చనిపోయింది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కావడంతో తోటి విద్యార్థినులతో కలిసి పాఠశాలకు దగ్గరలో ఉన్న గెడ్డకు దుస్తులు ఉతుక్కోడానికి వెళ్లింది. అనంతరం స్నానానికి దిగి ప్రమాదానికి గురైంది. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గెడ్డ లోతుగా ఉండడంతో విద్యార్థిని బయటకు రాలేకపోయింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండలంలోని గుం టసీమకు చెందిన ఎస్తేరు లక్ష్మీపతికి ఇద్దరు మగ పిల్లలు, అమ్మాయి ఉన్నారు. ఆరు నెలల కిందట అతని భార్య చనిపోయింది. కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పాఠశాలకు ప్రహరీలేకపోవడం వల్లే.. పాఠశాల ప్రహరీ పూర్తిగా శిథిలమైంది. పాఠశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతోవిద్యార్థినులు గుంపులు గుంపులుగా సమీపంలోని గెడ్డకు వెళుతుంటారు. పాఠశాల సిబ్బంది పట్టించుకోనితనం కూడా ఉంది. రోజూ మాదిరి శుక్రవారం కూడా గెడ్డలో దిగిన విద్యార్థిని రాణి గల్లంతయింది. తోటి విద్యార్థినులు పరుగున పాఠశాలకు వచ్చి చెప్పడంతో ఉపాధ్యాయులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాత్రి 7గంటలకు మృతదేహాం లభ్యమైంది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థిని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో పాఠశాలతోపాటు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పట్టించుకోని ఉన్నతాధికారులు.. విద్యార్థిని ఉదయం 8గంటల సమయంలో గెడ్డల పడి మృతి చెందింది. పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమశాఖ డీడీ, విద్యాశాఖ ఉన్నతాధికారులు సాయంత్రం వరకు ఈ సంఘటన పై పట్టించుకోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. గిరిజన విద్యార్థులంటే ఉన్నతాధికారులకు చులకన అని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబీకులు ఈ సంఘటనపై ఉపాధ్యాయులను నిలదీశారు. స్థానిక ఎస్ఐ హిమగిరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
భద్రాచలం: భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థిని కణిత ఝాన్సీ బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఈమెను కళాశాల లెక్చరర్ వేధిస్తున్నట్టుగా ఆమె డైరీ ద్వారా వెల్లడైంది. లెక్చరర్ వేధింపు కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతదేహంతో ఆమె బంధువులు సదరు కళాశాల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఝాన్సీ తండ్రి సీతారామయ్య, అన్న బాలకృష్ణ తెలిపిన ప్రకారం... చర్ల మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన కణిత ఝాన్సీ.. భద్రాచలంలోని చర్ల రోడ్డులోగల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె బుధవారం సాయంత్రం నెల్లిపాక మండలం చింతలగూడెంలో తన అన్న వరుసైన కణిత బాలకృష్ణ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె అక్క వివాహ నిశ్చితార్థం కోసమని బాలకృష్ణ, ఆయన కుటుంబీకులంతా సుబ్బంపేటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే చింతలగూడెం వెళ్లి మృతదే హాన్ని సుబ్బంపేట తీసుకెళ్లారు. ఆ తరువాత, ఆమె పుస్తకాలను పరిశీలిస్తుండగా డైరీ దొరికింది. ‘‘నా మరణానికి కళాశాలలోని ఓ లెక్చరర్ కారణం’’ అని రాసి ఉండటాన్ని వారు గమనించారు. తమ బిడ్డను లెక్చరర్ పొట్టనపెట్టుకున్నారని ఆరోపిస్తూ ఝన్సీ కుటుంబీకులు, బంధువులు ఆమె మృతదేహంతో భద్రాచలంలోని కళాశాల వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. దీనికి ఎస్ఎఫ్ఐ, గిరిజన విద్యార్థి సంక్షేమ పరిషత్, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ మద్దతుగా నిలిచాయి. లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుల సూచనతో నెల్లిపాక పోలీస్ స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిస్తాం : డీడీ ధర్నా చేస్తున్న ఝాన్సీ కుటుంబీకుల వద్దకు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ (డీడీ) సరస్వతి వెళ్లారు. ఝాన్సీ మృతిపై సమగ్ర విచార ణ జరిపిస్తామని, లెక్చరర్ తప్పు ఉన్నట్టుగా తేలి తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీం తో, ఆందోళనకారులు శాంతించి ధర్నా విరమిం చారు. విద్యార్థిని అంత్యక్రియల కోసం ప్రభుత్వపరంగా ఐదువేల రూపాయలు ఇచ్చారు. డీడీ సరస్వతి, ప్రిన్సిపాల్ మాణిక్యాలరావు చెరొక ఐదువేల రూపాయల చొప్పున ఇచ్చారు. అనంతరం, ఝాన్సీ సహ విద్యార్థులతోపాటు కళాశాల లెక్చరర్ల నుంచి వివరాలను డీడీ సేకరించారు. విద్యార్థిని మృతిపై పూర్తిస్థారుులో విచారణ జరుపుతున్నామని, నివేదికను ఐటీడీఏ పీవోకు ఇస్తామని అన్నారు. ఆత్మహత్యపై అనుమానాలు ఝాన్సీ ఆత్మహత్యపై కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనను తరచుగా లెక్చరర్ తిడుతోందని, తాను చనిపోవడానికి ఆమె కారణమని ఝాన్సీ తన డైరీలో రాసుకుంది. ఇది గత నెల 22వ తేదీన రాసినట్టుగా ఉంది. డైరీ రాసి న ఇన్ని రోజుల తరువాత, అందులోనూ సంక్రాం తి సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి కళాశాలకు వచ్చే క్రమంలో, బంధువుల ఇంట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? తన అక్క వివాహ నిశ్చితార్ధం వేడుకకు ఎందుకు వెళ్లలేదు? మృతదేహాన్ని నేరుగా సుబ్బంపేటకు ఎందుకు తీసుకెళ్లారు? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నారుు. ఝాన్సీ ఆత్మహత్యపై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. లెక్చరర్ బదిలీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ను బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గురుకుల ఆశ్రమ కళాశాలకు బదిలీ చేశారు. ఐటీడీఏ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇంచార్జ్ పీవో దివ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.