పిల్లలు ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు! | The Richard Feynman Technique Is Useful For Students | Sakshi
Sakshi News home page

పిల్లలు ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు!

Jul 7 2026 8:23 AM | Updated on Jul 7 2026 10:58 AM

The Richard Feynman Technique Is Useful For Students

వికాసం

కొందరికి చిన్న విషయమైనా సరే ‘నేర్చుకోవడం’ చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత రిచర్డ్‌ ఫెయిన్‌మెన్‌ ఒక టెక్నిక్‌ను రూపొందించాడు. ఇది ‘ఫెయిన్‌మెన్‌ టెక్నిక్‌’గా ప్రసిద్ధి పొందింది.
కొత్త మార్కెటింగ్‌ స్ట్రాటజీ నుంచి బ్లాక్‌చైయిన్‌ వరకు ఏదైనా సులభంగా నేర్చుకోవడానికి ‘ఫెయిన్‌మెన్‌ టెక్నిక్‌’ ఉపయోగపడుతుంది.

నాలుగు దశల ప్రక్రియ అయిన ‘ఫెయిన్‌మెన్‌ టెక్నిక్‌’ కంఠస్థం చేసే పద్ధతిని తిరస్కరిస్తుంది. పరిశోధన, రాయడం, వివరించడం, మెరుగుపరచడం ద్వారా నిజమైన అవగాహనను ప్రోత్సహిస్తుంది.
‘నేర్చుకోవడంలో మొదటి సూత్రం... మిమ్మల్ని మీరు మోసం చేసుకోకపోవడం. సబ్జెక్ట్‌ అర్థం కాకపోయినా అర్థమైంది అనుకోవడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అవుతుంది అంటారు ఫెయిన్‌ మెన్‌.

ఇలా చేయండి...

  • నేర్చుకోవడానికి ఒక సబ్జెక్ట్‌ను ఎంచుకోండి.

  • ఆ సబ్జెక్‌కు సంబంధించిన కీలక అంశాలను ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇలా రాసుకోవడం అనేది ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో పెడుతుంది. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయాలను రాసుకున్నప్పుడు మెదడులో ముఖ్యమైన విషయాలు స్పష్టంగా రూçపుదిద్దుకోవడం మొదలవుతుంది. ‘రాయడం అనేది సమాచార సేకరణ కాదు... సమాచారంతో మమేకం కావడం’

  • రాసుకున్న విషయాలను మీకు మీరే చెప్పుకోండి. లేదా ఇతరులకు చెప్పండి.

  • సబ్జెక్ట్‌లో ఏదైనా అర్థం కాకపోతే సమాచార మూలాన్ని (సోర్స్‌ మెటీరియల్‌) మరోసారి చదువుకోండి, వినండి. ఉదా: పుస్తకం, లెక్చర్‌ నోట్స్, పాడ్‌కాస్ట్‌... మొదలైనవి.

  • మరింత అర్థమయ్యేలా నోట్‌బుక్‌లో రాసుకోండి. తేలికపాటి ఉదాహణలను తీసుకోండి.

  • సాంకేతిక పదాలు, సంక్లిష్ట పదాలు, అస్పష్టమైన పరిభాష లేకుండా చూసుకోవాలి.

  • టాపిక్‌ను చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని చదువుకోవాలి.

  • చిన్నపిల్లవాడికి చెబుతున్నట్లుగా ఊహించుకొని, మీరు చదివిన సబ్జెక్ట్‌ను మీకు మీరే చెప్పుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement