సాక్షి, పులివెందుల: పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాల్లో కంచెలు ఏర్పాటు చేసి, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం తెల్లవారుజామున అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలతో పులివెందులలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, పోలీసుల చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు, పార్టీ నేతలు స్వేచ్ఛగా తమ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు.. అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది.
ఇదీ చదవండి: టీడీపీకి భారీ షాక్.. కన్నీరు పెడుతూ కీలక నేత రాజీనామా


