నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ రెండో దశ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌జీఎఫ్‌ రెండో దశ ఎంపికలు

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : నేటి నుంచి ఈ నెల 26 వరకు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 రెండో దశ జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్‌ అండర్‌–19 సెక్రటరీ మురళీ కృష్ణారెడ్డి తెలిపారు. 22, 23న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో హాకీ, పుట్‌బాల్‌, 23న డీఎస్‌ఏ క్రీడా మైదానంలో సెపక్‌తక్రా, వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో అధ్లెటిక్స్‌, నందలూరు చెయ్యేరులో బీచ్‌ వాలీబాల్‌, 24న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో జిమ్నాస్టిక్స్‌, అర్చరీ, జెఎంజె జూనియర్‌ కళాశాలలో నెట్‌బాల్‌, ప్రొద్దుటూరు జార్జిక్లబ్‌లో స్క్వాష్‌, 26న డీఎస్‌ఏ క్రీడా మైదానంలో రెజ్లింగ్‌, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో వాలీబాల్‌, కడప సిఎస్‌ఐ హైస్కూల్‌లో కల్వరి పట్టు ఎంపికలు ఉంటాయన్నారు. క్రీడాకారులు ఆయా తేదీలల్లో గుర్తింపు పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరుకావాలన్నారు.

23 నుంచి ఎస్‌జీఎఫ్‌

జిల్లా స్థాయి ఎంపికలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఈ నెల 23 నుంచి 26 వరకు జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14,17 జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రటరీలు విజయలక్ష్మీ, నాగరాజారెడ్డి తెలిపారు. 23న డీఎస్‌ఏ క్రీడా మైదానంలో సెపక్‌తక్రా, బాస్కెట్‌ బాల్‌, కురాష్‌, 24న అదే మైదానంలో క్రికెట్‌, కబడ్డీ, స్కేటింగ్‌, చెస్‌, 24న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్‌, అర్చరీ, 26న డీఎస్‌ఏ క్రీడా మైదానంలో వాలీబాల్‌, యోగా, ఖోఖో, 26న ప్రొద్దుటూరు జార్జీ క్లబ్‌లో స్వ్కాష్‌ ఎంపికలు చేపడతామన్నారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు గుర్తింపు కార్డులతో నిర్ణీత సమయానికి హాజరుకావాలన్నారు.

బస్సును ఢీకొన్న కారు: యువకుడు మృతి

పెద్దమండ్యం : కర్ణాటకలోని చింతామణి సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కలిచెర్లకు చెందిన షేక్‌ ఇమ్రాన్‌ (23) మృతిచెందాడు. మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కలిచెర్లకు చెందిన ఇమ్రాన్‌ తన బంధువును గల్ఫ్‌ వెళ్లేందుకు విమానాశ్రయంలో విడిచిపెట్టి కారులో తిరిగి వస్తున్నాడు.

ఈ క్రమంలో చింతామణి–మదనపల్లె రహదారిపై ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఇమ్రాన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఇరుక్కుపోయిన ఇమ్రాన్‌ మృతదేహాన్ని తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. 23 ఏళ్ల యువకుడు మృతిచెందడంతో కలిచెర్లలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement