మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

కడపకార్పొరేషన్‌ : కడప నగరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేశాయి. సోమవారం అర్థరాత్రి నంబర్‌ ప్లేట్లు లేని వాహనాల్లో వచ్చిన కొందరు దుండగులు రాళ్లు, బీరు సీసాలతో దాడి చేవారు. ఈ ఘటనలో మేయర్‌ అభ్యర్థి ఇంటి అద్దాలు, కిటికీలు ధ్వంసం అయ్యాయి.. ఇంటి వద్ద పగిలిపోయిన బీరు బాటిళ్లు, రాళ్లు కనిపించాయి.దాడిలో ధ్వంసమైన కిటికీలను నాయకులు పరిశీలించారు.

దాడి ఘటనపై ఆరా తీసిన

వైఎస్సార్‌సీపీ నాయకులు

మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌.బి. అంజాద్‌బాష, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పి. నరేన్‌ రామాంజులరెడ్డి లు మంగళవారం అంగడివీధి సమీపంలో ఉన్న వారి నివాసానికి వెళ్లి దాడి ఘటనపై ఆరాతీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంబర్‌ ప్లేట్లు లేని వాహనాల్లో వచ్చిన వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని, అసలు ఈ దాడి వెనుక ఎవరున్నారు, ఈ ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని అన్నారు. ఇలాంటి దాడులు జరపడం దుర్మార్గమని పేర్కొన్నారు. దాడి ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని, దాడికి పాల్పడిన వారిని గుర్తించాలని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని మేయర్‌ అభ్యర్థి దీప్తికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి షేక్‌ ఉమైర్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్‌, సీహెచ్‌ వినోద్‌, బంగారు నాగయ్య, దాసరి శివప్రసాద్‌, రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement