వైభవం.. శమీ దర్శనం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. శమీ దర్శనం

Oct 22 2026 7:14 AM | Updated on Oct 22 2026 7:14 AM

● అంబరమంటిన దసరా సంబరాలు

● కన్నులపండువగా వాసవాంబ తొట్టిమెరవణి

ప్రొద్దుటూరు కల్చరల్‌ : విజయదశమి రోజు ప్రొద్దుటూరు పట్టణం జనసంద్రమైంది. దసరా ముగింపు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శమీదర్శన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వాసవిమాత ఉత్సవ మూర్తిని పూలతో, పుత్తడి ఆభరణాలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకువచ్చి కొర్రపాడు రోడ్డులోని వాసవీ శమీవృక్ష మండపంలో శమీదర్శ నం చేయించారు. అగస్త్యేశ్వరాలయం రాజరాజేశ్వరీ ఉత్సవ కమిటీ, చెన్నకేశవాలయం, రాజరాజేశ్వరి ఆలయం, సత్యనారాయణస్వామి, విజయనగరంవీధి, వసంతపేటలోని చౌడేశ్వరీదేవి తదితర అన్ని ఆలయాల వారు కొర్రపాడు రోడ్డు మిల్లులోని శమీవృక్షం వద్ద దర్శనం చేశారు. డ్రోన్‌ ద్వారా పుష్పాలు వాసవీ మాతపై చల్లడం, కళాకారుల వేషధారణలు, కేరళ బ్యాండ్‌, డీజే, బాణసంచా పేళుల్లు, సినీ డూప్స్‌, పాలకొల్లు బ్యాండ్‌, విద్యుత్‌ ఆర్చీల వెలుగులు శమీదర్శనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అర్ధరాత్రి విజయలక్ష్మిదేవి అలంకారంలో అమ్మవారు గ్రామోత్సవం(తొట్టిమెరవణి) కన్నుల పండువగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement