సాక్షి, కాకినాడ జిల్లా: కత్తిపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భవానీ భక్తులను కారు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. విజయదుర్గమ్మ దర్శనానికి వస్తుండగా కత్తిపూడి రావికంపాడు జంక్షన్ దగ్గర ఘటన జరిగింది. విజయనగరం నుంచి విజయవాడ అమ్మవారి దర్శనానికి బస్సులో భక్తులు బయలుదేరారు.
మార్గమధ్యలో బస్సు రిపేర్ కావడంతో నడుచుకుంటూ టీ తాగడానికి వెళ్తున్న భక్తులపై.. ఒక్కసారిగా స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. దీంతో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: షేర్ మార్కెట్‌లో రూ.35 లక్షల నష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..


