వైఎస్సార్‌సీపీ నేతల కాళ్లు విరగకొట్టండి | TDP leaders provide direction for physical attacks on ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతల కాళ్లు విరగకొట్టండి

Oct 22 2026 6:12 AM | Updated on Oct 22 2026 6:12 AM

TDP leaders provide direction for physical attacks on ysrcp

ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వెయ్యకూడదు   

అవసరమైతే మరో 500 మందిని పంపిస్తా 

టీడీపీ శ్రేణులను పురికొల్పిన వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రాష్ట్రంలో టీడీపీ నేతలు ఎంతకు బరితెగించారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. వైఎస్సార్‌సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడాలంటూ బహిరంగంగానే దిశానిర్దేశం చేయడంతో పచ్చపార్టీ నేతలు ఏ స్థాయికి దిగజారారో స్పష్టంగా అర్థమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు బూత్‌ల వద్దకు రాకూడదని తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ నేతలకు పురికొల్పారు.

కలువాయి మండలంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం మనది. వైఎస్సార్‌సీపీ వాళ్లు నామినేషన్‌ వెయ్యకూడదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు వీల్లేదు. అలా ఎవరైనా మితిమీరితే వాళ్ల కాళ్లు విరగ్గొట్టాలి. అవసరం అయితే నియోజకవర్గంలోకి మరో 500 మందిని దింపుతా. మీరేమైనా చెయ్యండి’ అంటూ టీడీపీ నేతలను ఎమ్మెల్యే ఉసిగొల్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement