పక్కింటోడు నా బెడ్‌రూమ్‌లో కెమెరా పెట్టాడు..! | cctv camera allegedly installed to monitor bedroom complaint to sp | Sakshi
Sakshi News home page

పక్కింటోడు నా బెడ్‌రూమ్‌లో కెమెరా పెట్టాడు..!

Jun 23 2026 12:58 PM | Updated on Jun 23 2026 2:20 PM

cctv camera allegedly installed to monitor bedroom complaint to sp

అన్నమయ్య జిలా: తన పడకగదిలో జరిగేదంతా కనిపించేలా సీసీ కెమెరా అమర్చారని ఓ బాధితుడు జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌ వేదికకు మదనపల్లె మండలం, పోతబోలు గ్రామం, భూమకంవారిపల్లికి చెందిన భాస్కర్‌ హాజరయ్యాడు. 

తన నివాసంలోని పడక గదిని టార్గెట్‌ చేసి ప్రత్యర్థులైన గంగులప్ప, జయలక్ష్మిలు సీసీ కెమెరా ఏర్పాటు చేసి, కెమెరాలో రికార్డు అయిన వీడియోలను సెల్‌ ఫోన్ల ద్వారా బహిర్గతం చేసి తనను అవమానిస్తున్నారని  ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్యతో ఉన్న వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement