విషాదం.. కరెంట్‌ తీగలు తగిలి వైఎస్సార్‌సీపీ నేత కుమారుడు మృతి | Ashwin Aradya Death With Power Shock At Hindupuram | Sakshi
Sakshi News home page

విషాదం.. కరెంట్‌ తీగలు తగిలి వైఎస్సార్‌సీపీ నేత కుమారుడు మృతి

May 3 2025 12:56 PM | Updated on May 3 2025 1:46 PM

Ashwin Aradya Death With Power Shock At Hindupuram

సాక్షి, సత్యసాయి: హిందూపురంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరెంట్‌ షాక్‌ తగిలి వైఎస్సార్‌సీపీ నేత కుమారుడు అశ్విన్‌ ఆరాధ్య(11) మృతిచెందాడు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కన్న కొడుకు చనిపోవడంతో తల్తి బోరున విలిపిస్తోంది.

వివరాల ప్రకారం.. హిందూపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత వాల్మీకి లోకేష్ కుమారుడు అశ్విన్ ఆరాధ్య. వేసవి సెలవులు కావడంతో అశ్విన్‌ తన స్నేహితులతో కలిసి ముద్దిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో బాల్‌ తీసుకునేందుకు వెళ్లగా అక్కడే ఉన్న కరెంట్‌ తీగలు తగలి షాక్‌ కొట్టింది. దీంతో, అశ్విన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి విషయం తెలిసిన తల్లి బోరును విలపిస్తూ కన్నీరుపెట్టుకుంది.

మరోవైపు.. కూటమి సర్కార్ పాలనలో అక్రమ కేసుల కారణంగా వాల్మీకి లోకేష్ ఇటీవలే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం వాల్మీకి లోకేష్ జైలులో ఉండగా.. కొడుకు మరణ వార్త విని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. కొడుకు అశ్విన్ ఆరాధ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాల్మీకి లోకేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement