పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయులు,పెన్షనీర్లను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఫ్యాప్టో నాయకులు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం... మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో (ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం పుట్టపర్తిలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గజ్జల హరిప్రసాద్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్ గౌస్ లాజం మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు రెండేళ్లు దాటినా ఇప్పటికీ కనీసం పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని, ఐఆర్ ఉసేలేదని మండిపడ్డారు. తక్షణం 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు నిర్వహించే ప్రత్యేక టెట్‌లో ఉత్తీర్ణత మార్కులు ఒకే విధంగా ఉండాలన్నారు. బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా టెట్ సిలబస్ పరిమితం చేయాలన్నారు. ఆఫ్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్, జీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో చెప్పాలన్నారు. వెంటనే పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్‌ఓ కొండయ్యకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో సభ్యులు, వైఎస్సార్‌టీఏ పీవీ రమణారెడ్డి, యూటీఎఫ్ శెట్టిపి జయచంద్రారెడ్డి, శ్రీనివాసులు, చంద్ర, సురేంద్ర, షమీవుల్లా, రామకృష్ణ, గోపాల్, వెంకటేష్, జవహర్, రామమోహన్, గోపాల్ నాయక్, జయకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, వేణుగోపాల్, శ్రీనివాసరెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఉదయ్‌కుమార్, అశోక్, శ్రీనివాసులు, ఆదిబయన్న, రవీంద్రారెడ్డి, నరసింహారెడ్డి, రాజశేఖర్, రామకృష్ణ, లత, రామకృష్ణానాయక్, భూతన్న, బాబు, లక్ష్మీనారాయణ, అమర్, నారాయణరెడ్డి, చెన్నకేశవవులు, రాజగోపాల్, ప్రతాప్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, సురేష్, శ్రీనివాసులరెడ్డి, రంగస్వామి, రామలింగయ్య, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించంలో
ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం
కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా
పీఆర్సీ కమిషన్ నియమించి,
30 శాతం మధ్యంతర భృతి
ప్రకటించాలని డిమాండ్


