పరిగి: మండల పరిధిలో జరుగుతున్న ఇసుక దందాపై ‘కూటమి చెర.. చిత్ర వథ’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. పరిగి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఉదయం పైడేటి, విట్టాపల్లి తదితర గ్రామాలకు చెందిన ఇసుక ట్రాక్టర్లు ఉన్న వ్యక్తులను ఎస్‌ఐ రవికుమార్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉచితం మాటున ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించమన్నారు. అదేవిధంగా పొరుగు మండలాలతో పాటూ కర్ణాటక ప్రాంతాలకు ఇసుక తరలిస్తే ఎలాంటి వారిౖపైనెనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
సమగ్ర విచారణకు ఆదేశం
పుట్టపర్తి: మామిడి మొక్కల రైతులకు అందాల్సిన బిల్లులు పక్కదారి పట్టిన విధానంపై ఈనెల 13న ‘రూ.11 కోట్లు హాంఫట్ ’ అన్న శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, పచ్చ నేతలు కుమ్మకై ్క పెద్ద మొత్తంలో దారిమళ్లించారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా మండలాల ఎంపీడీఓలు, పీఓలు, ఏపీఓలు 2014–19 మధ్య జరిగిన పనులు, చెల్లింపు మొత్తం వివరాలను సమర్పించాలని పీడీ ఆదేశించారు.


