ఉట్నూర్‌రూరల్: పోలీసుశాఖపై మరింత వి శ్వాసం పెరిగేలా సేవలందించాలని ఎస్పీ అ ఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భా గంగా ఉట్నూర్ ఏఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టేను అడిగి వివరా లు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును న మోదు చేసి సంబంధిత అధికారుల ద్వారా సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీ సుకోవాలన్నారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించినప్పుడే పోలీసు శాఖపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు ఎం ప్రసాద్, సీహెచ్ రమే శ్, కె నరేశ్, ఎస్సైలు సాయన్న, ఇమ్రాన్, ఎల్ శ్రీకాంత్, విక్రమ్, విజయ్, ఉన్నారు.


