ఆదిలాబాద్‌టౌన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకు రావాలని డీఎంహెచ్‌వో సాధన అన్నారు. రిమ్స్ ఆడిటోరియంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి ప్రారంభించా రు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పండ్లు అందించి అభినందించారు. అలాగే సర్టిఫి కెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల సభ్యులు బాలశంకర్ కృష్ణ, ఠాకూర్ ప్రతాప్ సింగ్, ప్రశాంత్, రక్తదాతలు, రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.


