నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గానికి ఒకటి చొప్పున..

Jul 18 2026 3:17 AM | Updated on Jul 18 2026 3:17 AM

విద్యారంగంలో విప్లవాత్మక మార్పు

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు కసరత్తు

నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రతిపాదనలు

వీటితో పాటు 14 మోడల్‌ స్కూళ్లు సైతం..

ఇక ఇంటర్‌ వరకు ఒకే చోట చదువు

అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి..

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతుంది. అంతర్జాతీయ స్థాయి తలపించేలా నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌) ఏర్పాటు చేసేందుకు ముందుకు సాగుతుంది. వరంగల్‌ జిల్లాలోని అరుట్లలో ఏర్పాటు చేసిన టీపీఎస్‌లో ప్రస్తుతం ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు విద్యాబోధన చేపడుతున్నారు. ఇందులో అధునాతన ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, గ్రంథాలయాలు వంటి సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన అందుతుంది. ఉమ్మడి జిల్లా పరి ధిలోని విద్యా శాఖాధికారుల నుంచి నియోజకవర్గానికి ఒక పాఠశాలను ప్రతిపాదనలు తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మోడల్‌ స్కూళ్లను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పాఠశాలకు దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు సమకూర్చనున్నట్లు విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు.

సకల సౌకర్యాలు..

నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసే ఈ పాఠశాలలో 4 నుంచి 6 ఎకరాల స్థలంలో భవనా లు, క్రీడా మైదానాలు, ల్యాబ్‌లు, డైనింగ్‌ హాల్‌, లై బ్రెరీ వంటివి ఏర్పాటు చేయనున్నారు. ప్రతి తరగతి గదిలో స్క్రీన్‌ వైర్‌లెస్‌ మైక్‌లు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, ఏఐ ల్యాబ్‌లు, 700 మంది విద్యార్థులు కూర్చునేలా డైనింగ్‌ హాల్‌, సీసీ నిఘా, ఆర్‌ఓ ప్లాంట్స్‌ వంటివి ఏర్పాటు చేయనున్నారు. వీటితో పా టు విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించేందుకు కళలు, క్రీడలు, గార్డెన్‌ రూపొందించనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు ఒకేచోట విద్యాబో ధన జరగనుంది. ప్రీప్రైమరీలో 20 మంది, ప్రైమరీలో 30, ఉన్నత తరగతుల్లో 40 మంది విద్యార్థులతో క్లాసులు నిర్వహించనున్నారు. అలాగే ఆయా గ్రామాల నుంచి వచ్చే పిల్లల కోసం బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపడతారు. మొత్తం మీద ఒక క్యాంపస్‌లా ఈ పాఠశాలను రూపొందించనున్నారు. పరీక్ష విధానం ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో పది నియోజకవర్గాలు, నాలుగు జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొ ప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ దిలాబాద్‌ నియోజకవర్గంలో జెడ్పీఎస్‌ఎస్‌ యా పల్‌గూడ, జెడ్పీఎస్‌ఎస్‌ నేరడిగొండ, నిర్మల్‌ జిల్లాలో మోడల్‌ స్కూల్‌ కుంటాల, జెడ్పీఎస్‌ ఎస్‌ నర్సాపూర్‌, ప్రభుత్వ పాఠశాల ఖానాపూర్‌, మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చెన్నూర్‌, కేజీబీవీ బెల్లంపల్లి, జెడ్పీఎస్‌ఎస్‌ మంచిర్యాల/ప్రభుత్వ పాఠశాల గర్మిల ప్రతిపాదనలు పంపించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జెడ్పీఎస్‌ఎస్‌ కాగజ్‌నగర్‌, జెడ్పీఎస్‌ఎస్‌ ఆసిఫాబాద్‌ ప్రతిపాదనలు పంపించారు. వీటితో పాటు ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ఆరు మోడల్‌ స్కూళ్లు, ఆసిఫాబాద్‌లో రెండు మోడల్‌ స్కూళ్లు, మంచిర్యాలలో ఐదు మోడల్‌ స్కూళ్లు, నిర్మల్‌లో ఒక మోడల్‌ స్కూలు ఉన్నాయి. వీటిని సైతం తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లుగా మార్చేందుకు అవకాశాలు ఉన్నట్లు విద్యా శాఖాధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement