ఆదివాసీ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ సమస్యల పరిష్కారానికి కృషి

Jul 18 2026 3:17 AM | Updated on Jul 18 2026 3:17 AM

● రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

ఉట్నూర్‌రూరల్‌: ఆదివాసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. మండలంలోని కుమ్మరికుంట గ్రామాన్ని కమిషన్‌ సభ్యులు, ఐటీడీఏ పీవో మకరందుతో కలిసి శుక్రవారం సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత గృహాల అవసరం, భూమి, నివాస హక్కులు, తాగునీరు, రహదారులు, విద్యుత్‌ వంటి సమస్యలను దృష్టికి తెచ్చారు.వాటిని శ్రద్ధగా విన్న చైర్మన్‌ సంబంధిత శాఖల అధికారులతో చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ, అట వీ, వైద్య ఆరోగ్య, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గిరిజన సంస్కృతికి ప్రతీక నాగోబా

ఇంద్రవెల్లి: గిరిజన సంస్కృతికి ప్రతీక నాగోబా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. కమిషన్‌ స భ్యులతో కలిసి శుక్రవా రం కేస్లాపూర్‌లోని నా గోబా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయులు వారికి నాగో బా ప్రతిమ అందించి స న్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడారు. గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసానికి నా గోబా ప్రతీకగా నిలిచిందన్నారు. గ్రామ సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలని సర్పంచ్‌ మెస్రం తుకారాం, గ్రామ పటేల్‌ వెంకట్‌రావ్‌లు చైర్మన్‌కు వి నతి పత్రం అందించారు. ఇందులో కమిషన్‌ సభ్యులు రాంబాబునాయక్‌, నీలాదేవి, ప్రవీణ్‌, ఐటీడీఏ ఏపీవో జనరల్‌ వసంత్‌రావ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement