శ్రీగిరిలో నూతన ఏఎస్పీ పూజలు | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరిలో నూతన ఏఎస్పీ పూజలు

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

ఒంగోలు మెట్రో: జిల్లా ఏఎస్పీ (అడ్మిన్‌)గా బాధ్యతలు చేపట్టిన యుగంధర్‌ శుక్రవారం ఉదయం ఒంగోలు కొండమీద శ్రీగిరి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీగిరి దేవస్థానం అర్చకులు, వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. తొలుత శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు కలిసి ఏఎస్పీకి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement