బోథ్: బోనాలతో వెళ్తున్న మహిళలు
ఇంద్రవెల్లి: పూజలు చేస్తున్న ఆదివాసీలు
వరుణుడు కరుణించాలని జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రజలు పూజలు చేస్తున్నారు. ఇంద్రవెల్లి
మండలంలోని 30 గ్రామాల ఆదివాసీలు వడగాం గ్రామ పంచాయతీ పరిధిలోని గజ్జల రాజుల్ దేవతకు పూజలు చేశారు. బోథ్ మండల కేంద్రంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ, రజక సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ, ముత్యాల పోచమ్మకు బోనాలు సమర్పించారు. జైనథ్ మండలంలోని బెల్గాంలో గంగనీళ్లతో గ్రామ దేవతలను అభిషేకించారు. నేరడిగొండలో ముదిరాజ్ కులస్తులు భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. – బోథ్/ఇంద్రవెల్లి/జైనథ్/నేరడిగొండ


