ఆదిలాబాద్: జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.ఉదారి నారాయణ ప్రతిష్టాత్మక ‘ముల్కనూర్ కథా పురస్కారం’ అందుకున్నారు. హన్మకొండ జిల్లా ముల్కనూర్‌లో ఆదివారం నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవ వేడుకల్లో ప్రముఖ ప్రకృతి కవి జయరాజు, ముల్కనూర్ సంస్థ చైర్మన్, ఐఏఎస్ అధికారి వేముల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై పురస్కారం అందజేశారు. ఇందులో భాగంగా రూ.5 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. సాహితీ రంగంలో తనదైన ముద్రవేస్తూ, ప్రాంతీయ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న డా.ఉదారి ఈ పురస్కారాన్ని అందుకోవడంపై పలువురు కవులు, రచయితలు, ‘ఐత్యారం ముచ్చట్లు’ వేదిక సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.


