చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలువునా చితికిపోతున్న పొగాకు రైతుకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. పొగాకు రైతు దీక్షల పేరుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన దీక్షలో వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించి వేలం కేంద్రాల్లో బేళ్లన్నీ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలకుల రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు చేసిన మేలును గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


