వైఎస్సార్‌ సీపీ కార్యకర్తకు మేరుగు నివాళులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తకు మేరుగు నివాళులు

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

మద్దిపాడు: మండలంలోని బసవన్నపాలెం ఎస్సీకాలనీలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త బందెల అభినయ్‌కుమార్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గురువారం రాత్రి 11 గంటల సమయంలో బసవన్నపాలెం చేరుకుని అభినయ్‌కుమార్‌ మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మంచి నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తను కోల్పోవడం బాధాకరమని అన్నారు. అభినయ్‌కుమార్‌ కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. ఆయన వెంట పార్టీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, నాయకులు పాలడుగు రాజీవ్‌, బెజవాడ శ్రీరామమూర్తి, గుడ్డపాతల రవి, కాకర్ల వెంకటేశ్‌, బొమ్మల రామాంజనేయులు, మద్దినేని శ్రీకాంత్‌, గద్దె జాలయ్య, పోలినేని వెంకట్రావు, పూర్ణచంద్రరావు, విక్కీ, అమర్‌, ధనరాజ్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది...

నాగులుప్పలపాడు: కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ నిరంతరం అండగా ఉంటుందని పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మద్దిరాలపాడు గ్రామంలో వద్దినేని నారాయణమ్మ మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి నారాయణమ్మ చిత్రపటానికి పూలమాలతో శుకవారం మేరుగు నివాళులర్పించారు. అనంతరం అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న గ్రామ నాయకుడు చెరుకూరి సురేష్‌ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, మారెళ్ల బంగారుబాబు, పాలడుగు రాజీవ్‌, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, కాకర్ల వెంకటేష్‌, శ్రీరామమూర్తి, గుడ్డపాతల రవి, నాయకులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement