ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు వీడనాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ అన్నా రు. సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో శనివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ సర్కారు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధిహామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే ‘జైల్ భరో’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఇందులో సంఘం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు, జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, ఆశన్న, స్వామి, మంజుల, పాల్గొన్నారు.


