ఉట్నూర్‌రూరల్: గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమ ఫలాలు ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. ఉట్నూ ర్ కేబి కాంప్లెక్స్‌లోని సమావేశ మందిరంలో గిరిజన ఏజెన్సీ మండలాలకు చెందిన పాత్రికేయులతో శనివారం నిర్వహించిన స మావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా అవగాహన కల్పించడంలో మీడియా సహకారం అవసరమని అన్నారు. సమావేశంలో అదనపు పౌర సంబంధల అధికారి వై. సంపత్‌కుమార్, ఐటీడీఏ అధికారులు, గిరిజన ఏజెన్సీ మండలాలకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు.


