ముగిసిన ఎల్‌ఆర్‌ఎస్ గడువు
కై లాస్‌నగర్: అక్రమ లేఅవుట్ క్రమబద్ధీకరణకు సంబంధించి 25శాతం ఫీజు రాయితీతో కూడిన ఎల్‌ఆర్‌ఎస్ గడువు సోమవారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో సెలవు రోజైనా మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు యథావిధిగా సేవలందించారు. దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పది కౌంటర్ల ద్వారా తమ ప్లాట్లకు సంబంధించిన ఫీజు చెల్లించారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సోమవారం ఒక్క రోజే 300 మంది వరకు ఫీజు చెల్లించినట్లుగా పట్టణ ప్రణాళికాధికారి సుమలత తెలిపారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి పట్టణ పరిధిలో 22,369 దరఖాస్తులు రాగా అందులో 3వేల దరఖాస్తులకు మాత్రమే ఫీజు చెల్లించినట్లుగా తెలుస్తోంది. రాయితీ గడువు ముగియడంతో మరోసారి అవకాశం కల్పించాలని ఫీజు చెల్లించని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ గడువు పొడిగిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ల శాఖలో కనిపించని సందడి..
2024–25 ఆర్థిక సంవత్సరం ముగిసింది. సోమవారం చివరి రోజు కావడంతో జిల్లాలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు సెలవురోజైనా యథావి ధిగా పనిచేశాయి. ఉద్యోగులు అందుబాటులో ఉండి సే వలందించారు. అయితే ఆశించిన స్థాయిలో రిజిస్ట్రేషన్లేమి కాలేదు. ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు జనరల్ రిజిస్ట్రేషన్లు కాగా, మరో నాలుగు ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించినవి అయ్యా యి. ఇక బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. అయితే ఆరుగురు దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు మాత్రమే చెల్లించారు. ఎలాంటి ప్రొసీడింగ్‌లు అందుకోలేదని రిజి స్ట్రేషన్ అధికారులు తెలిపారు.


