ఏసుక్రీస్తు మార్గంలో నడవాలి..
సంతనూతలపాడు: లోక రక్షకుడు ఏసు క్రీస్తు బోధనలు ఆచరణీయమని ఎంపీడీవో సురేష్‌బాబు అన్నారు. మండల పరిషత్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడారు. పాస్టర్ ఎం. జాషువా ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, ఎంపీపీ బుడంగుంట విజయ, తహసీల్దార్ ఎస్‌ఎల్ నారాయణ రెడ్డి, మద్దినేని హరిబాబు కార్య క్రమానికి అతిథులుగా విచ్చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సంతనూతలపాడు, డిప్యూటీ ఎంపీడీవో. పి. రవికుమార్, వెలుగు ఏపిఎం. టి. బాబురావు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
క్విస్ కళాశాలలో..
ఒంగోలు సిటీ: క్విస్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆనందంతో సమష్టిగా జరుపుకున్నారు. వేడుకలకు క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టరు సూర్యకళ్యాణ చక్రవర్తి, వైస్ చైర్మన్ గాయత్రి దేవి, అలాగే ప్రిన్సిపాల్ హనుమంతరావు తమ శుభాకాంక్షలు, సందేశాలు అందించారు. విద్యార్థులు క్రిస్మస్ పాటలు ఆలపిస్తూ సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా వేడుకలను జరిపారు. అనంతరం కేక్ కట్ చేసి సహ విద్యార్థులు, మిత్రులతో పంచుకున్నారు. కార్యక్రమంలో బుజ్జిబాబు, నవనీత కృష్ణన్, శిరీష, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఏసుక్రీస్తు మార్గంలో నడవాలి..


