మామిడి తోటలో గంజాయి మొక్కలు
క్లుప్తంగా
స్థానికం
● ధ్వంసం చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులు
యర్రగొండపాలెం: మామిడి తోటలో అంతర్ పంటగా కంది సాగుచేసి అందులో గంజాయి మొక్కలు పెంచుతున్న సంఘటన మంగళవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గాంధీనగర్ పొలాల్లో పిక్కిలి చిన్న సుబ్బయ్య మామిడి తోట పెంచుతున్నాడు. ఖరీఫ్‌లో అంతర్‌పంటగా కందిపంటను విత్తుకున్నాడు. ఆ పంటతో పాటు గంజాయిని కూడా సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై పి.చౌడయ్య, తహసీల్దార్ మంజునాథరెడ్డి, ఉద్యాన శాఖాధికారి పి.ఆదిరెడ్డిలతో తోటపై దాడులు నిర్వహించారు. కందిలో ఒక సాలులో 40 గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 10 కిలోల గంజాయి అకును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గంజాయి మొక్కలను ఎకై ్సజ్ శాఖాధికారులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.
మామిడి తోటలో గంజాయి మొక్కలు
మామిడి తోటలో గంజాయి మొక్కలు


