హిందువులపై దాడులకు నిరసనగా ర్యాలీ
ఒంగోలు మెట్రో: బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న అరాచక దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఒంగోలు నగరంలో విశ్వహిందూ పరిషత్, హైందవ సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ దగ్గర నుంచి అద్దంకి బస్టాండ్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కూడల వద్ద వరకు నిరసన ర్యాలీ చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందూ బంధువులు ప్లకార్డులు చేతపట్టి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఈమని బలరాం, ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పసుమర్తీ వెంకటేశ్వర్లు వీహెచ్‌పీ ప్రతినిధులు పాల్గొన్నారు.


