మద్యం మత్తులో రోడ్డున పడి..
గిద్దలూరు రూరల్: మద్యం మత్తు నెత్తికెక్కి ఓ యువకుడు రోడ్డుపై చిందులు వేస్తూ నడవలేక ఓ మహిళ ఇంటి ముందు చిందులు వేస్తూ కిందపడిపోయాడు. ఈ సంఘటన మంగళవారం పట్టణంలోని క్లబ్‌రోడ్డులో భారత్ గ్యాస్‌ఆఫీసు వద్ద జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం తాగరా తమ్ముడు తాగి ఊగరా తమ్ముడు అన్న చందాన విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయిస్తోంది. యువత మత్తులో చిత్తయ్యేలా ప్రభుత్వాలే సహకరిస్తూ ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయిస్తూ వారి జీవితాలు నాశనం అయ్యేందుకు కారణమవుతున్నాయి. పట్టణంలోని క్లబ్ రోడ్డులో ఓ మహిళ చలికి ఎండ కోసం తన ఇంటి ముందు కూర్చుని ఉంది. ఆ సమయంలో అటువైపుగా వెళుతున్న ఆ యువకుడికి మద్యం మత్తు నెత్తికెక్కి నడవలేక ఆమె ఇంటి ముందు ఊగుతూ తూగుతూ రోడ్డుపైనే కిందపడిపోయాడు. దీంతో ఆ మహిళ ఏం చేయాలో అర్థకాలేక భయాందోళన చెందింది. కొంత సేపటి తరువాత ఆ యువకుడు నెమ్మదిగా లేచి వచ్చి పోయే వాహనాలను ఢీకొట్టేలా రోడ్డుపై తూలుతూ వెళ్లాడు.


