వివాదాస్పద స్థలంపై ఆర్‌డీ విచారణ
కై లాస్‌నగర్: పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో గల వి వాదాస్పద స్థలంపై మున్సిపల్ శాఖ వరంగల్ రీ జినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ మంగళవారం వి చారణ చేపట్టారు. కమల్ కండెల్‌వాల్ అనే వ్యక్తి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి నకిలీ రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా ఆరోపిస్తూ మున్నూరుకాపు సంఘ నాయకులు సీడీఎంఏకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీడీఎంఏ విచారణకు ఆదేశించారు. దీంతో మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆర్‌డీ మున్సిపల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులు వచ్చి వి వరాలు వెల్లడించారు. అయితే తాను అందుబాటులో లేకపోవడంతో రాలేకపోతున్నానంటూ కమల్ కండేల్‌వాల్ సమాచారమందించాడు. ఆర్డీ మున్సిప ల్ అధికారులను విచారించి వివరాలు తెలుసుకున్నారు. సంబంధించిన రికార్డులు సేకరించారు. అ నంతరం వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. సీడీఎంఏకు నివేదిక అందజేస్తానని ఆర్డీ పేర్కొన్నారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించా రు. ఉద్యోగులతో మాట్లాడి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఆయన వెంట మున్సి పల్ కమిషనర్ సీవీఎన్. రాజు తదితరులున్నారు.
బల్దియాలో బాహాబాహీ
బల్దియా కార్యాలయంలో ఓ మాజీ కౌన్సిలర్, ము న్సిపల్ ఉద్యోగి బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయానికి రీజినల్ డైరెక్టర్ తనిఖీకి వచ్చిన సమయంలోనే ఈ ఘటన చో టు చేసుకోవడం గమనార్హం. ఒకరినొకరు నెట్టుకోవడంతో పాటు పరస్పరంగా దూషించుకున్నారు. ఇది గమనించిన మున్సిపల్ ఉద్యోగులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అయితే వీరి మధ్య గొడవకు కారణాలు తెలియరాలేదు. గతంలో వీరి మధ్య మనస్పర్థల కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. ఘర్షణకు పాల్పడిన ఇరువురు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.


