రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఆదిలాబాద్‌టౌన్: రైతులను ఆదుకునేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కిసాన్‌చౌక్‌లో అఖిల పక్షం రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కా ర్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కిసాన్ విగ్రహా నికి పూలమాల వేశారు. అనంతర మాట్లాడా రు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ గజానంద్, అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షుడు బండి దత్తాత్రి, గోవర్ధన్, కిష్టు, మల్లేశ్, దేవిదాస్, బొర్రన్న తదితరులు పాల్గొన్నారు.


